ప్రతిభ వున్న విద్యార్ధులకి స్కాలర్ షిప్స్… వివరాలు ఇవే..!

-

ప్రతిభ వున్నా చాలా మంది విద్యార్థులు పేదరికం వలన చదువుకోలేకపోతున్నారు. అయితే అలంటి వాళ్ళు చదువుకోవడానికి కొన్ని స్కాలర్ షిప్స్ వున్నాయి. వీటి ద్వారా విద్యార్ధులకి చదువుకోవడం అవుతుంది. మరి స్కాలర్ షిప్స్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇక్కడ మూడు స్కాలర్‌షిప్ల వివరాలు వున్నాయి. నవంబర్ 30, 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22:

కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ పేరుతో ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు. పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. 2021 బోర్డు పరీక్షలలో కనీసం 75% మార్కులతో 10వ తరగతి లేదా 12వ తరగతిలో కనీసం 60% మార్కులతో వారి హయ్యర్ సెకండరీ, 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా అప్లై చెయ్యాలి. www.b4s.in/it/KISF1

నికాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22:

నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫోటోగ్రఫీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి (12వ తరగతి ఉత్తీర్ణులు) స్కాలర్‌షిప్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి సంవత్సరానికి లక్ష రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ వస్తుంది. www.b4s.in/it/NSP5

కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021:

కరోనా వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ఈ స్కాలర్ షిప్. 1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగడనుంది. జనవరి 2020 నుంచి తల్లిదండ్రులు/సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడిని కోల్పోవడం లేదా సంపాదించే కుటుంబ సభ్యుడు ఉద్యోగం కోల్పోవడం వంటి వాళ్ళ కోసం ఇది. www.b4s.in/it/CCSP1

Read more RELATED
Recommended to you

Exit mobile version