ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు పదవీ విరమణ చేయడానికి సిద్దమయ్యారు. గత ఏడాది ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పుడే ఎల్వీ సుబ్రహ్మణ్యం ని ఆ పదవిలో నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత జగన్ సిఎం అయినా సరే ఆయనను కొనసాగి౦చారు.
అప్పుడు చంద్రబాబు సర్కార్ కి ఆయన కంట్లో నలుసులా మారారు. చంద్రబాబు కేబినేట్ సమావేశం నిర్వహించాలి అని భావించినా సరే అప్పుడు ఆయన అడ్డు చెప్పారు. ఆ తర్వాత జగన్ సిఎం కావడం ఆయన అనుభవాన్ని గుర్తించి పదవిలో ఉండాలి అని కోరడం అన్నీ జరిగాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు గాని ఆయనను ఆ పదవి నుంచి తప్పించి నీలం సహానిని నియమించారు.
ఆ తర్వాత ఆయనను అకస్మాత్తుగా హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేసారు. కాని ఆయన ఆ పదవిలో చేరకుండానే హైదరాబాద్ దీర్ఘ కాలిక సెలవులో వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆయన సచివాలయానికి వెళ్ళలేదు. ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఇక ఆయన ఆన్లైన్ లో చార్జ్ తీసుకుని రిటైర్ అయ్యే అవకాశం కల్పించింది ఏపీ సర్కార్.