హైదరాబాద్ నగర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఉదయం నాగోల్ ఫ్లై ఓవర్ ని ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్ కీలక ప్రకటన చేశారు. 143 కోట్ల రూపాయలతో నాగోల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టింది తెలంగాణ సర్కార్.
కిలో మీటర్ పొడవుతో నాగోల్ ఫ్లై ఓవర్ ను ఏర్పాటు చేశారు. ఈ నాగోల్ ఫ్లై ఓవర్ కారణంగా… ఉప్పల్ నుంచి ఎల్ బి నగర్ వరకు ట్రాఫిక్ క్లియర్ కానుంది. ఇప్పటికే ఎల్ బి నగర్ నగర్ జంక్షన్ అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డు పై సాఫీగా జర్నీ సాగుతోంది. ఇక నాగోల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే… ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.
Another infrastructure addition to Hyderabad city; Will be opening the Six lane, 990metre long Nagole Flyover tomorrow which will ease flow of traffic from LB Nagar to Secunderabad
Built by GHMC at a cost of ₹143.58 Cr under the SRDP program pic.twitter.com/7J1etJOBiv
— KTR (@KTRTRS) October 25, 2022