తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో గల ముచ్చింతల్ ప్రాంతంలో సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు పన్నెండో రోజు సహ్రస్త్రాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేడు దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతా మూర్తి కేంద్రానికి రానున్నారు. ఈ రోజు ఆయన సమతా మూర్తి కేంద్రంలో 120 కిలోల బంగారంతో తయారు చేసిన స్వర్ణమూర్తి విగ్రహానికి లోకార్పణ చేయనున్నారు.
కాగ 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారు విగ్రహాన్ని రూపొందించారు. కాగ దీనిలో మై హోం గ్రూప్ అధినేత రామేశ్వర రావు 27 కిలో గ్రాముల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే మరి కొంత మంది విరాళలతో 54 అంగుళాల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగ రాష్ట్రపతి రాక తో హైదరాబాద్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. దాదాపు 7 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేశారు. కాగ రాష్ట్రపతి రామ్ నథ్ కోవింద్ ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ కు చేరుకుంటారు.