చలి చంపేస్తోంది… తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

-

చలి చంపేస్తోంది. చలి తీవ్రతకు తెలంగాణ గజగజ వణుకుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి అధికంగా ఉంది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా చలి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. గడిచిన 24 గంటల్లో బజార్ హత్నూర్( ఆదిలాబాద్) లో అత్యల్పంగా 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బేల( ఆదిలాబాద్ ) 7.9 డిగ్రీలు, అర్లీ(టీ) ( ఆదిలాబాద్) 8.0 డిగ్రీలు, వాంకిడి( కుమురంభీం) 8.1 డిగ్రీలు, కెరమెరి(కుమురంభీం) 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version