నేడు వైఎస్‌ షర్మిల రైతు వేదన నిరాహార దీక్ష

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల ఇవాళ దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు వైయస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు.

హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహారదీక్షకు కూర్చోనున్నారు వైఎస్ షర్మిల. మిగతా 48 గంటలు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు వైయస్ షర్మిల. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు పై ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీలు ధర్నా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రైతుల పట్ల కేంద్ర విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అలాగే రైతులు అందరూ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version