కేరళను వణికిస్తున్న నోరో వైరస్.. అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది..? తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటి..?

-

కేరళను నోరో వైరస్ వణికిస్తుంది. వయనాడ్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వైరస్ కేసుల గురించి కలవరం వ్యక్తం చేశారు. అయితే అసలు ఇది ఎలా వ్యాపింస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి తెలుసుకుందాం..

  1. నోరో వైరస్ జీర్ణాశయం పై ప్రభావం చూపించే వైరస్ తరగతికి చెందినది. ఇది జీర్ణాశయం.. పేగుల లైనింగ్ దెబ్బతీసి వాపుకు కారణమవుతోంది. వాంతింగ్, విరేచనాలకు కారణం అవుతోంది.
  2. జంతువుల్లో ఉండే వ్యాధి.. ఆహారం, నీటి ద్వారా మనుషులకు సోకుతుంది.
  3. ఆరోగ్యవంతులపై పెద్దగా ప్రభావం చూపని వైరస్.. పిల్లలు, పెద్ద వయస్సు వారిపై  ప్రభావం చూపిస్తుంది.
  4. నీటి ద్వారా వచ్చే అవకాశాలు ఉండటంతో, నీటిని క్లోరినేషన్ చేసిన తర్వాత తీసుకుంటే వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
  5. జంతువుల నుంచి సోకే ఈ వైరస్, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.
  6. వైరస్ బారిన పడిన వ్యక్తి వాంతులు, విరేచనాల వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వైరస్ సోకిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
  7. వైరస్ సోకిన రెండు రోజుల తర్వాత వ్యాధి తాలూకూ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.
  8. వైరస్ సోకిన వ్యక్తికి వాంతులు, విరేచనాలతో పాటు, జ్వరం, బాడీ పెయిన్స్, తలనొప్పి లక్షణాలు ఉంటాయి.
  9. వైరస్ సోకిన వ్యక్తి డాక్టర్ ను సంప్రదించాలి. ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణాన్ని, వేడి చేసిన నీటినే తాగాలి.
  10. వైరస్ సోకకుండా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరైతే జంతువలకు దగ్గరగా ఉంటారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
  11. కూరగాయలు, పండ్లు పూర్తిగా శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
  12. బయట ఆహారానికి దూరంగా ఉండాలి.
  13. చేపలు, రొయ్యలు, పీతలను బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version