పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం..!

-

బంగారం కొనాలని అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. నిన్న బంగారం ధరలు పెరిగిన తర్వాత ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేట్లు దిగి రావడం తో దేశీ మార్కెట్లోనూ ధరలు తగ్గాయి. బంగారం ధరలు లాగే వెండి కూడా కాస్త దిగింది.

మరిన్ని వివరాల లోకి వెళితే… మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ మార్కెట్‌ లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర గురువారం 0.33 శాతం క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,622కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కె్ట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది.

పసిడి రేటు ఔన్స్‌కు 0.34 శాతం తగ్గుదలతో 1894 డాలర్లకు క్షీణించింది. అమెరికా డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల బంగారం ధరపై ప్రభావం ఉంటుంది. అదే విధంగా జూలై సిల్వర్ ఫ్యూచర్ ధర కూడా 0.21 శాతం తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,261కు చేరింది.

వెండి ఔన్స్‌కు 0.48 శాతం తగ్గుదలతో 27.72 డాలర్లకు క్షీణించింది. ఇది ఇలా ఉంటే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి కారణాల వలన పసిడి రేటు పై ప్రభావం ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version