యాదాద్రి భువనగిరి: తెలంగాణ మొత్తం ఇవాళ సాయంత్రం చల్లబడిపోయింది. ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు సాయంత్రం పూట పడిన వర్షం కాస్త ఊరటనిచ్చింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షం పడటానికి ముందు విపరీతంగా గాలులు వీచాయి. దీంతో పలు చోట్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లింది.
జిల్లాలోని మల్లాపురంలో వీచిన భారీ ఈదురుగాలులకు తాటి చెట్టు మీద కల్లు గీస్తున్న గీత కార్మికుడు చంద్రయ్య తాటి చెట్టు మధ్యలో విరిగిపోవడంతో.. తాడి చెట్టుతో సహా.. కింద పడి మృతి చెందాడు. తాడి చెట్టు మొదలు అతడి మీద పడటంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.