గొల్లపూడి మరణంపై సినీ ప్రముఖులు ఎవరెవరేమన్నారంటే….!!

-

మహేష్ బాబు….. తెలుగు సినిమా పరిశ్రమకు పలు విధాలుగా విశేషమైన సేవలందించిన దిగ్గజ నటులు గొల్లపూడి గారిని కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జాతి వజ్రం లాంటి వ్యక్తి గొల్లపూడి మారుతి రావు గారని, ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

అనిల్ రావిపూడి……ఆయన రచన, ఆయన నటన, ఎప్పటికీ మరువలేము….. గొల్లపూడి మారుతి రావు గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

అన్నపూర్ణ స్టూడియోస్…. తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన దిగ్గజ నటులు, సహృదయ శీలి అయిన గొల్లపూడి మారుతి రావు గారు నేడు అకాల మరణం పొందటం ఎంతో బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆత్మవిశ్వాసం ప్రసాదించాలని కోరుకుంటున్నాం.

కోన వెంకట్…..ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ప్ ప్లే రచయిత గా, మాటల రచయిత గా , నటుడిగా, అన్ని విభాగాల్లో మేటి అనిపించుకుని, నంది అవార్డ్స్ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి “గొల్లపూడి మారుతీ రావు ” గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

గోపీచంద్…. టాలీవుడ్ గర్వించదగ్గ గొప్ప నటులు గొల్లపూడి మారుతి రావు గారు నేడు మన అందరినీ విడిచి తిరిగి రాని అనంత లోకాలకు వెళ్ళిపోవటం ఎంతో బాధాకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

వరుణ్ తేజ్…. టాలీవుడ్ సీనియర్ నటులు గొల్లపూడి మారుతి రావు గారితో కలిసి నటించిన రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను. నేడు వారు మన అందరినీ విడిచి వెళ్లి పోవడం ఎంతో బాధాకరం. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

అల్లరి నరేష్….. నటుడిగా రచయితగా తెలుగు సినిమా పరిశ్రమకు విశేష సేవలందించిన గొల్లపూడి మారుతి రావు గారు నేడు హఠాన్మరణం చెందటం పరిశ్రమకు ఎంతో పెద్ద తీరనిలోటు. ఇకపై ఆయన రచనలు, నటన మనకు కనపడవంటేనే ఎంతో బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news