అయోధ్య తీర్పుపై సుప్రీం మ‌రో ట్విస్ట్‌

-

భారతదేశంలో ఈ రెండు శతాబ్దాలుగా ఎంతోమందిని తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన అయోధ్య ఈ వివాదంపై సుప్రీంకోర్టు గత నెలలో ఎట్టకేలకు తుది తీర్పు వివరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం ఉన్న ప్రాంతం హిందువులకు వదిలేస్తూ… ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు అక్కడే మరో స్థలం ఇవ్వాలని ధర్మాసనం సభ్యులు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే దీనిపై రివ్యూ పిటిషన్ కు అవకాశం ఉండదని అందరూ భావించారు.

నవంబర్‌ 9న అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ మందిర నిర్మాణానికి వీలుగా ‘రామ్‌లల్లా’కు అప్పగించాలని తీర్పులో పేర్కొంది. సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై డిసెంబర్‌ 2న తొలి రివ్యూ పిటిషన్‌ దాఖలైంది.

అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఇప్పటి వరకు మొత్తం 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ క్రమంలోనే తాజాగా తీర్పుకు వ్యతిరేకంగా నమోదైన మరో రివ్యూ పిటిషన్ ను సైతం సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ఇక‌పై అయినా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డుతుంద‌నే అంద‌రూ భావిస్తున్నారు.
ఈ పిటిషన్లను మిగతా కేసుల మాదిరిగా సాధారణ విధానాన్ని అనుసరించకుండా ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news