అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా టాలీవుడ్ కమెడియన్ ట్వీట్..!

-

గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్  పేరు మార్మోగిపోతోంది. ఆయన తీవ్రమైన వివాదాన్ని ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంధ్య థియేటర్ ఘనటలో ఆయన తప్పు ఉందని ఇటీవల కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. దీంతో సినీ సెలబ్రిటీలు అంతా ఐకాన్ స్టార్కు సపోర్ట్ గా నిలిచారు. ఈ క్రమంలో.. నటుడు రాహుల్ రామకృష్ణ కూడా పోలీసులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.

ఇటీవల ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి  అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తన తప్పు లేదని అన్నారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, రాహుల్ రామకృష్ణ  ఓ సెన్సేషనల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news