టాలీవుడ్ కామెడీ స్టార్ హీరో.. హ్యాపీ బ‌ర్త్‌డే అల్ల‌రి న‌రేశ్‌..!

-

టాలీవుడ్‌లో కామెడీ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌.. ఆయ‌న సినిమా చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు. క‌డుపుబ్బా న‌వ్విస్తూ క్లైమాక్స్‌లో క‌న్నీళ్లు పెట్టించ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఇప్ప‌టి వ‌ర‌కు సినీ ఇండ‌స్ట్రీలో ఏకైక కామెడీ స్టార్‌గా చెల‌రేగిపోతున్న హీరో అల్ల‌రి న‌రేశ్‌. అల్ల‌రే అల్ల‌రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి త‌న ఇంటిపేరునే అల్ల‌రిగా మార్చుకున్నాడు ఈ అల్ల‌రి హీరో. అయితే ఈ రోజు ఆయ‌న పుట్టిన‌రోజు. మ‌రి ఆయ‌న జీవితంలో జ‌రిగిన విశేషాలు మీ కోసం.

అల్ల‌రి న‌రేశ్‌

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ రెండో కుమారుడు ఎడారా నరేష్. ఈయ‌న 30 జూన్ 1982లో జ‌న్మించాడు. ఆయ‌న అల్ల‌రి మూవీతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. ఆత‌ర్వాత తొట్టి గ్యాంగ్, కితకితలు, గ‌మ్యం, బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావ్, అత్తిలి స‌త్తిబాబు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఆయ‌న ఖాతాలో వేసుకుని కామెడీ స్టార్ హీరోగా అవ‌త‌రించాడు.

దాదాపు ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న 55మూవీల్లో న‌టించాడు. ఇందులో ఆయ‌న న‌ట‌న‌కు గుర్తింపు తెచ్చిన‌వి సీమ తుపాకీ, సుడిగాడు, య‌ముడికి మొగుడు, మ‌హర్షి, నంది లాంటివి ఉన్నాయి. గ‌మ్యం మూవీలో నటించినందుకు ఆయ‌న‌కు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు ద‌క్కాయి. ఇక తన అన్నయ్య ఆర్యన్ రాజేష్‌తో కలిసి వారి నిర్మాణ సంస్థ అయిన ఈవీవీ సినిమా ప్రొడ‌క్ష‌న్‌ను చూసుకుంటున్నాడు.

ఇక వ్యక్తిగ‌త విష‌యానికి వ‌స్తే నరేష్ 2015 లో చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ విరుప కాంతమనేనిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఇక అత‌ను న‌టించిన నువ్వంటే నాకిష్టం, డేంజర్ పార్టీ వంటి ఫ్లాప్ సినిమాలు కొత్త ఇబ్బంది పెట్టినా.. కితకితలు లాంటి మూవీతో, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రీసెంట్‌గా ఆయ‌న నాంధి మూవీలో న‌టించ‌గా అది మంచివిజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేశ్ మూడు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న మ‌రిన్ని విజ‌యాల‌తో దూసుకుపోవాల‌ని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version