చేతులు ముడుచుకుని కూర్చోలేదు.. జలవివాదంపై ఏపీ మంత్రి బొత్స సీరియస్

-

అమరావతి: రాజకీయ లబ్ది కోసం తెలంగాణ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలంగాణతో జలవివాదంపై సీరియస్ అయ్యారు. తెలంగాణ మంత్రుల్లా తాము అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. నీటి పంపకాల వివాదం అంశంపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని హెచ్చరించారు. ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయన్నారు.

విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయని బొత్స పేర్కొన్నారు. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు సహకరిస్తామని చెప్పారు. తామ మౌనంగా లేమన్నారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయని తెలిపారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా చేస్తామని చెప్పారు. త్వరలోనే రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version