కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి అండ్ ఫ్యామిలీ..!

-

టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తన కుటుంబ సభ్యులందరికి నెగెటివ్ వచ్చిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెండు వారాల క్వారంటైన్‌ పూర్తయ్యింది. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. టెస్ట్ చేయించుకుంటే మా అందరికి నెగటివ్‌ అని తేలింది. ప్లాస్మా దానం చేసేందుకు తగినన్ని ఆంటీ బాడీస్‌ అభివృద్ధి చెందుతున్నాయో లేదో చూసేందుకు మూడు వారాల టైమ్‌ పడుతుందని డాక్టర్‌ చెప్పారు. ఆ తర్వాత ప్లాస్మా డొనేట్‌ చేస్తాం` అని ట్వీట్ చేశారు.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`  సినిమా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో, మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. అయితే గతవారం డివివి దానయ్యకి సైతం కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version