టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. !

-

టాలీ వుడ్ డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ డ్రగ్స్ కేసు లో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ.

విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తి స్తే ఫెమా కేసులూ నమోదు చేసే యోచనలో ఈడీ ఉన్నట్లు సంచారం అందుతోంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖులను ప్రశ్నించ నుంది ఈడీ. విచారణ లో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉంది. కాగా గతంలో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల ను విచారించిన ఈడి.. కెల్విన్, పీటర్, కమింగా అనే వ్యక్తులను నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ముగ్గురి స్టేట్మెంట్ ల ఆధారంగా విచారణ ను తీవ్ర తరం ఈడీ.. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ నటులకు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news