అబ్బా ఏమున్నాడురా.. స్టైల్ సూపర్, లుక్ కేక, ఇంత అందంగా ఉన్నాడేంట్రా బాబు, ఆరు పదలు వయసు వచ్చినా ఇంకా మన్మథుడులా ఉన్నాడు.. ఇవన్నీ తమ అభిమాన హీరోలు చూసి ఫ్యాన్స్ మాట్లాడుకునే మాటలు. ఎందుకంటే సాధారణంగా హీరోలు ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా, ఫిట్‌గా కనిపిస్తూ.. సినిమా సినిమాకు లుక్ ఛేంజ్ చేస్తూ మరింత గ్లామర్‌గా తయారవుతుంటారు.
అయితే ఇందుకోసం డైట్‌ను పాటిస్తుంటారు. ఎంతో శ్రమిస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. కసరత్తులు కూడా చేస్తుంటారు. అయితే ఈ ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మన కథనాయకులు ఎక్కువుగా ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడతారో తెలుసుకుందామా?
టాలీవుడ్ గ్లామర్ కింగ్ నాగార్జున.. ఆరు పదుల వయసులో ఇంకా అందంగా కనిపిస్తూ.. యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. అయితే ఆయన దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.
మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే చాలా ఇష్టమట. సీఫుడ్‌తో పాటు చిరు దోశలను కూడా ఇష్టంగా తింటారట.
బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారట. అలాగే చికెన్ బిర్యానీ అంటే బాలయ్యకు ఫేవరెట్ ఫుడ్! అయితే ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ ఫుడ్‌ను ఆస్వాదించడం బాలయ్యకు అలవాటు అంట.
విక్టరీ వెంకటేష్ నోస్టాల్జిక్ కీమాను ఫేవరెట్ ఫుడ్. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకొని నోస్టాల్జిక్ కీమాను తినడమంటే వెంకీకి బాగా ఇష్టమట.
ప్రభాస్ సాధారణంగా ఫుడ్ లవర్. ఎన్నో వివిధ రకాలు ఆహారాన్ని ఆయన ట్రై చేస్తూనే ఉంటారు. అయితే ఆయనకు ఎక్కువగా బిర్యానీ అంటే ఇష్టమట. అలానే సీ ఫుడ్‌తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారట.
మహేశ్ బాబు వాళ్ళ అమ్మమ్మ చేసే ప్రతి వంటనూ ఎంతో ఇష్టంగా తినేవారట. ప్రస్తుతం మహేశ్ ఇష్టమైన వంటకాలను డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నారట.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్‌తో పాటు మంచి చెఫ్ కూడా. ఇక ఆయనకు ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి కీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారట.
రామ్ చరణ్‌కు కూడా ఫెవరేట్ ఫుడ్ బిర్యానీనే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరెట్ అంట. అయితే బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు.