ఎంపీగా పోటీ చేయనున్న టాలీవుడ్ హీరోయిన్

-

వెస్ట్ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలలోను టిఎంసి అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.

ఇదిలా ఉంటే …టాలీవుడ్ హీరోయిన్ రచనా బెనర్జీ ఎంపీగా పోటీ చేయనున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.టీఎంసీ తరఫున హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా? సినిమాలో రచన నటించారు. ఆ తర్వాత కన్యాదానం, మావిడాకులు, సుల్తాన్, అభిషేకం, రాయుడు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version