కీలక షెడ్యూల్ లో టాప్ హీరోస్ మూవీస్…!

-

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరి టాప్ హీరోల సినిమాలు ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాయి.జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ షూట్స్ తో ఆయా సినిమాలు టాకీ పార్ట్ లను పూర్తి చేసుకోబోతున్నాయి.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో సుమారు 5 నెలలు ఆగిన ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే మొదలైంది.పవన్ కళ్యాణ్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ సైతం ఈనెల 26 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు కేటాయించారు. ఈ 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం పూర్తయిపోతుంది.

రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’.ఈ పవర్ ఫుల్ కాప్ డ్రామా ఫైనల్ షెడ్యూల్ ను మాస్ మహారాజ్ నిన్ననే స్టార్ట్ చేశారు.వీలైనంత త్వరగా సినిమాను ముగించేసే పనిలో పడ్డారు. వీటితో పాటుగా అంతకు మించిన ఎనర్జీతో ప్రమోషన్స్ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ మాస్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మరోసారి రవితేజతో శృతి హాసన్ జతకట్టిన ఈ చిత్రాన్ని మలినేని గోపిచంద్ డైరక్ట్ చేస్తున్నారు.

వెంకటేష్ నారప్ప’ సినిమా చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి మిగతా చిత్రీకరణ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సురేష్ బాబు ఇప్పటికే రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసిన నేపథ్యంలో.. ‘నారప్ప’ని డిజిటల్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక నితిన్ రంగ్ దే కడా ఎంతో రిస్క్ చేసి మరీ కీలక మైన షెడ్యూల్ పూర్తి చేసుకున్నామని టీమ్ వెల్లడించింది.మిగిలిన ఫైనల్ షెడ్యూల్ ను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకువస్తామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version