తెలుగు తెరకు మరో తమిళకుట్టి ప్రియాంకా మోహన్‌

-

తెలుగులో మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా చాన్స్‌లు కొట్టేస్తోందీ అమ్మడు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ ఇప్పటివరకు ఒకే ఒక్క సినిమా అదీ కన్నడ సినిమాలో నటించింది.

ప్రియాంకా అరుల్‌ మోహన్‌. ముద్దుగా ప్రియాంకామోహన్‌ అని ప్రస్తుతానికి పిలుచుకుంటున్న ఈ తమిళ అమ్మాయి దక్షిణాదిలో సంచలనం సృష్టించబోతోంది. 24ఏళ్ల ఈ అందాలరాశి తన మొదటి సినిమాగా కన్నడంలో ‘ఒంద్‌ కథే హెళ్ల’ అనే సినిమాలో నటించింది. గిరీశ్‌ గిరిజాజోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీక్‌ రావు హీరోగా నటించాడు. తండ్రి అరుల్‌ మోహన్‌.

Tollywood Star Heros Want To Act With Priyanka Arul Mohan

తెలుగు సినిమా పరిశ్రమకు నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. శర్వానంద్‌ హీరోగా, కిషోర్‌రెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీకారం’ సినిమాకు ఈ అమ్మాయి సైన్‌ చేసినట్టుగా తెలిసింది. అలాగే, అఖిల్‌ అక్కినేని కథానాయకుడుగా, బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో రూపొందబోయే చిత్రంలో కూడా ఈ అమ్మడినే హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్సయ్యారట. తమిళంలో కూడా ఈ ఏడాదే రాజేశ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ‘ది మాయన్‌’ అనే చిత్రంలో నటించేందుకు తన అంగీకారం తెలిపింది.

Tollywood Star Heros Want To Act With Priyanka Arul Mohan

అద్భుతమైన అందంతో, పదహారణాల అచ్చతెలుగు అమ్మాయిలా మెరిసిపోతున్న ప్రియాంకామోహన్‌, తొందరలోనే తెలుగు పరిశ్రమను ఓ ఊపు ఊపేలా కనబడుతోంది. ఏదేమైనా ‘గ్యాంగ్‌లీడర్‌’ విడుదలయితేనే గానీ, ఈ అమ్మాయి భవిష్యత్తేంటో ఊహించలేం.

Read more RELATED
Recommended to you

Exit mobile version