యాష్ పై ఫోకస్ చేసిన టాలీవుడ్ టాప్ డైరక్టర్స్…!

-

కేజిఎఫ్ ఫిలింతో ఇండియన్ సినిమాకు పరిచయమైన హీరో యాష్ .త్వరలో కేజిఎఫ్ ఫ్రాంచైజీలో సెకండ్ ఫిలింతో మన ముందుకు రావాలనని చూస్తున్నాడు. ఐతే ఈసిరీస్ ఫిలిం తర్వాతి యాష్ చేసే సినిమాలపై మార్కెట్లో గట్టిగానే డిస్కషన్స్ జరుగుతున్నాయి.బాలీవుడ్ ,కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ యాష్ ను డైరెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

యాష్ కు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే చాలామంది బాలీవుడ్ నిర్మాతలు… ట్రై చేశారు.ఐతే ఏ ఒక్కరికి అతను అంతగా రెస్పాండ్ అయ్యింది లేదు.చేద్దాం చూద్దాం అనే అంటున్నాడు తప్ప మరో మాట మాట్లాడితే ఒట్టు.ఐతే గత కొన్ని రోజులుగా తమిళ అగ్రదర్శకుడు శంకర్ ..యాష్ తో సినిమా చేస్తున్నాడనే రూమర్ కన్నడ పరిశ్రమలో గట్టిగా నడుస్తుంది.

యాష్,శంకర్ ముచ్చట ఇలా ఉంటే..కన్నడిగులు మాత్రం రాజమౌళి యాష్ తో సినిమా చేయాల్సిందే అంటున్నారు.గత కొంతకాలంగా నెట్టింట్లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మీరు చేసే తర్వాతి ఫిలిం యాష్ తోనే ఉండాలంటున్నారు.కన్నడలో ఒకరిద్దరు బడా దర్శకులు తమ తర్వాతి ప్రాజెక్ట్ లను ఈ హీరోతోనే అనుకుంటున్నప్పటికీ ఎవ్వరకీ మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు.కేజిఎఫ్ సిరీస్ తర్వాతనే తన డెసిషన్ చెబుతానంటున్నాడు.బహుశా యాష్ కూడా ..ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాలనే తలంపుతో ఉన్నాడంటున్నారు ఫిల్మీ క్రిటిక్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version