గూఢాచారి గా మారుతున్న టాలీవుడ్ యువ హీరోలు.. కారణం..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గూఢాచారి కథలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా మరింత క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. సినిమా స్టోరీ అంత పక్కాగా కుదిరింది అంటే చాలా పక్కాగా ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు సైతం ఇలాంటి కథలలో నటించకపోయినా పలువురు యువ కథానాయకులు మాత్రం గూఢచారులుగా, ఏజెంట్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

Adavishesh, Nikhil, Akhil

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క దశలో ఒక్కో రకమైన కథలకు మంచి హావ నడుస్తుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు గ్యాంగ్ స్టర్, దొంగ, క్రీడాకారుడు, పోలీస్ స్టోరీ లతో హీరోలు సైతం ప్రేక్షకులను సందడి చేయడం జరిగింది. అందుచేతనే కొంతమంది తారలు ఒకే తరహాలో కొన్ని కథలను ఎంచుకొని ప్రేక్షకులను బాగా అలరిస్తుంటారు.

తాజాగా హీరో కళ్యాణ్ రామ్ డెవిల్ పేరుతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు గా సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులలో బాగా ఆసక్తి రేపాయి.

ఇక నాగార్జున చిన్న కుమారుడైన అఖిల్ కూడా ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ చిత్రం కూడా ఒక స్పై తో జరిగే టువంటి కథ కావడంచేత హీరో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారు.

ఇక రెండో గూడచారి స్పై అనే పేరుతో మరొక చిత్రంలో నటిస్తున్నాడు హీరో నిఖిల్ ప్రస్తుతం ఈ సినిమాని గ్యారీ బి హెచ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో హీరో నిఖిల్ నటిస్తున్నారు.

ఇక డైరెక్టర్ శశి కరెంట్ దర్శకత్వంలో గూఢాచారి 2018 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో కూడా అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు.

ఇక తమిళంలో కూడా ఇలాంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇక తెలుగులో ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఇప్పుడు అలాంటి పాత్రల్లోనే మహేష్ బాబును కూడా చూడాలన్నది ఆయన అభిమానులు కల.

Read more RELATED
Recommended to you

Exit mobile version