టాలీవుడ్ నిర్మాతకు కరోనా..?

-

గత కొన్ని రోజుల నుంచి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల ముందు వరకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా శరవేగంగా పాకిపోతుంది. మొదటగా చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్నారూ. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

రాజమౌళి తో పాటు తన ఫ్యామిలీకి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ చికిత్స తీసుకుంటున్నారు, ఇదిలా ఉంటే టాలీవుడ్ లో యువ నిర్మాత కూడా కరోనా పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలే వరుస సినిమాలు నిర్మిస్తూ రెండు విజయాలు సొంతం చేసుకొన్న ఓ నిర్మాతకి పరీక్షించగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇక ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్నారట సదరు నిర్మాత. ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ప్రస్తుతం కరోనా వైరస్ టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది,

Read more RELATED
Recommended to you

Exit mobile version