గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు బిల్లు తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో అమరావతి రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇక ఈ రోజు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానులు నిర్మాణం కి సంబంధించిన బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలపడంతో ఒక్కసారిగా రాజధాని రైతులు భగ్గుమన్నారు.ఈ నిర్ణయాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రాజధాని అమరావతి ప్రాంత రైతులు అందరూ మరోసారి రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. గవర్నర్ మూడు రాజధానులు కు సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేయడం నిజంగా దురదృష్టకరం అంటూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని రాజధాని రైతులు తెలిపారు. అటు కోర్టుల పరిధిలో ఉన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు రాజధాని రైతులు