టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ ముందుకు నందు..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. మొదట విచారణ కు దర్శకుడు పూరి జగన్నాథ్ హజరవగా ఆ తరవాత ఛార్మీ కౌర్ ఆ తరవాత రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కు హాజరయ్యారు. ఇక ఈరోజు నందు ఈడి కార్యాలయం కు విచారణకు వచ్చారు. నిజానికి నందు ఈ నెల 20 న విచారణ కు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈడి అధికారుల అనుమతి తో ఇవ్వాళ విచారణ కు హాజరయ్యాడు.

డ్రగ్స్ వినియోగం…ఫెమా నిబంధనల ఉల్లంఘన పై నందు ను ఈడి అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక డ్రగ్స్ కేసులో రేపు విచారణకు హీరో రానా మరియు ఈనెల 9న విచారణ కు రవితేజ హాజరు కానున్నారు. ఇక ఈ కేసులో కెల్విన్ ఇచ్చిన సమాచారం అధికారులకు కీలకం గా మారింది. ఈ కేసులో ఈడి మొత్తం 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తోంది.