ఏపీకి కేంద్రం శుభవార్త.. మరిన్ని అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు

-

అమరావతి : జగన్‌ సర్కార్‌ కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరిన్ని అప్పులు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి వెసులు బాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ లిమిటును రూ. 10,500 కోట్ల మేర పెంచింది కేంద్రం. తొమ్మిది నెలల రుణ పరిమితిని రూ. 31,251 కోట్లకు పెంచుతూ అనుమతులు ఇచ్చింది.

Jagan
Jagan

2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా అప్పుల తీసుకునేందుకు వెసులుబాటు రూ. 42,472 కోట్ల వరకు ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆర్బీఐకు సమాచారం అందించింది కేంద్ర ఆర్దిక మంత్రిత్వ శాఖ. కేంద్రం నిర్ణయంతో అదనంగా మరో రూ. 10,500 కోట్ల మేర రుణ సమీకరణ చేసుకునే ఏపీకి అవకాశం ఉండనుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రూ. 10,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీకి ఛాన్స్ ఉండనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తో  జగన్‌ సర్కార్‌ భారీ ఊరట లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news