Breaking: రేపు దుబ్బాక బంద్

-

కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడికి నిరసనగా రేపు దుబ్బాక నియోజకవర్గ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, బంద్ను విజయవంతం చేయాలని కోరింది. కాగా ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్‌ రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు (38) అనే వ్యక్తి క‌త్తితో దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావంతో బాధ‌ప‌డుతున్న ప్రభాకర్‌ రెడ్డిని ప్రాథమిక చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ దవాఖానకు త‌ర‌లించామని, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. . గాయపడిన ప్రభాకర్‌ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌ రావు హుటాహుటిన దవాఖానకు వెళ్లి ప్రభాకర్‌ రెడ్డిని పరామ ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. హత్యాయత్నంలో రాజకీయ కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ కేడర్‌ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. ప్రభాకర్‌రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version