కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరో రెండు రోజులు సెలవులు పొడిగించింది ప్రభుత్వం.

ఇక మెదక్ జిల్లాలో రేపు ఒక్క రోజు మాత్రమే జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రకటించారు. కాగా బీబీపేట – కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దింతో బీబీపేట – కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు ఉంది. ఇక అటు కామారెడ్డి లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా .. 20 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డి జిల్లాలో NH44 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారిపై వరద నీరు నిల్వలేనప్పటికీ, ట్రాఫిక్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 20 కి.మీ మేర నిలిచిపోయాయి వాహనాలు.