హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. రూ.225 కోట్లతో త్వరలో హైదరాబాద్‌కి బీచ్ రానుంది. హైదరాబాద్ నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ఆమోదం తెలిపిండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానున్నట్లు సమాచారం అందుతోంది.

బీచ్లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై ట్రోలింగ్ చేస్తున్నారు. తనని కామెడీ చేశారన్న కక్షతోనే.. రేవంత్ రెడ్డి ‘బీచ్’ తెస్తున్నారా? అని చురకలు అంటిస్తున్నారు. గతంలో.. ఒక ప్రసంగంలో హైదరాబాద్ చుట్టూ సముద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సమయంలో సీఎంపై సెటైర్లు వేశారు. సీఎం అయ్యుండి ఇంత అవగాహనలేమీ వ్యాఖ్యలా? అంటూ ట్రోల్స్ చేసారు. కానీ ఇప్పుడు సుమారు 35 ఎకరాల్లో రూ.225 కోట్ల బడ్జెట్‌తో బీచ్ నిర్మాణం చేపెట్టేందుకు రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.