చంద్రబాబు కేసు విచారణ తీర్పుపై ఎదురుచూస్తోన్న దేశం… !

-

గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్ర యువకుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన కొత్త స్కీం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగినదాసుని ఏపీ సీఐడీ చంద్రబాబు ను అరెస్ట్ చేసి రోజుల పాటుగా రిమాండ్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ సమయం సెప్టెంబర్ 22తో పూర్తి కానుంది. ఇక చంద్రబాబు తరపున లాయర్లు అతనిపై సీఐడీ వేసిన అన్ని అభియోయోగాలను కొట్టివేయాలంటూ ఒక స్క్వాష్ పిటీషన్ ను రేపు హై కోర్ట్ విచారణ చేయనుంది. ఈ విచారణ కోసం దాదాపుగా దేశమంతా వెయ్యి కళ్ళతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది అని చెప్పాలి. కేవలం ఒక్క వైసీపీ మినహాయిస్తే… దేశంలోని అన్ని పార్టీలు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తమ వాణిని వినిపించడం జరిగింది. ఇటువంటి సమయంలో కోర్ట్ ఎటువంటి తీర్పును తీసుకోనుంది అన్నది చాలా ఆసక్తిగా మారింది.

ఇక దీనితో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వేసిన పిటీషన్ కూడా విచారణకు రానుంది. మరి రేపు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version