మునుగోడులో ఇచ్చిన హామీలపై రేపు కేటీఆర్ సమీక్ష

-

తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. దేశం మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే… కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మునుగోడులోనియోజ‌క‌వ‌ర్గంలో ఇచ్చిన హామీలపై గురువారం ప‌ర్య‌టించ‌నున్నారు.

మునుగోడు ప‌ట్ట‌ణంలోని ధ‌న‌ల‌క్ష్మి ఫంక్ష‌న్ హాల్లో జ‌రిగే స‌మావేశంలో ఉప ఎన్నిక‌లో ఇచ్చిన హామీల అమ‌లుపై మంత్రి కేటీఆర్ స‌మీక్షించ‌నున్నారు. ఈ స‌మావేశానికి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. మునుగోడుకు ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపొందిన విష‌యం విదిత‌మే. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version