కరీంనగర్ లోని దీపిక ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ వెల్లగా మత్తుమందు ఇచ్చి టెక్నీషియన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ కుటుంబ సభ్యులకు అసలు విషయాన్నీ తెలపడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివరాలను సేకరించగా టెక్నీషియన్ కెమెరాకు అడ్డుగా పరదవేసి అత్యాచారం తెలిసినట్లుగా చేసినట్లుగా తెలిసింది.

వివరాల్లోకి వెళితే… దీపిక హాస్పిటల్ ఓటి టెక్నీషియన్ దక్షిణామూర్తి టైఫాయిడ్ వైద్యం కోసం వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లుగా సిపి గౌస్ అలం తెలిపారు. కాగా నిందితుడు నేరానికి ముందు మద్యం సేవించాడని విచారణలో తేలింది. వార్డులోని సీసీ టీవీలో దృశ్యాలు రికార్డు కాకుండా దక్షిణామూర్తి పరదా అడ్డుగా వేశాడు. ఆ తర్వాత బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా అత్యాచారానికి ముందుగా అతడి ఫోన్లో అశ్లీల కంటెంట్ లభించిందని సిపి గౌస్ అలం తెలిపారు. నిందితుడు మహారాష్ట్రకు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.