ప్రస్తుత ఆధునిక యుగంలో జనాలకు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దీంతో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. అలాగే ఫిట్‌నెస్ యాప్‌లు, ఫిట్ నెస్ బ్యాండ్ల వాడకం కూడా ఎక్కువైంది. వాటిల్లో హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీవో2 సెన్సార్ వంటి ఫీచర్లను అందిస్తుండడంతో జనాలు ఆ ఫీచర్లను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యత్నిస్తున్నారు. అయితే ఏ ఫిట్ నెస్ బ్యాండ్‌ను కొనాలి అని వారు సందేహిస్తున్నారు. అలాంటి వారు కింద ఇచ్చిన టాప్ 5 స్మార్ట్ బ్యాండ్లపై ఓ లుక్కేయవచ్చు.
1. ఎంఐ బ్యాండ్ 5
1.1 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ ప్రూఫ్, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్, ఎస్‌పీవో2 సెన్సార్ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. రూ.2,499 ధరకు ఈ బ్యాండ్‌ను కొనుగోలు చేయవచ్చు.
2. అమేజ్‌ఫిట్ బిప్ యు
1.43 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ ప్రూఫ్, 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్, ఎస్‌పీవో2 సెన్సార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.3,499.
3. రియల్‌మి స్మార్ట్ బ్యాండ్
1.08 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ ప్రూఫ్, 14 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. ఇందులో ఎస్‌పీవో 2 సెన్సార్ లేదు. దీని ధర రూ.1,599.
4. షియోమీ ఎంఐ వాచ్ రెవాల్వ్
1.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ ప్రూఫ్, జీపీఎస్, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్, ఎస్‌పీవో2 సెన్సార్ ఫీచర్లు ఈ బ్యాండ్ లో ఉన్నాయి. దీని ధర రూ.9,999.
5. అమేజ్‌ఫిట్ జీటీఎస్
1.65 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ ప్రూఫ్, జీపీఎస్, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఫీచర్లు ఈ బ్యాండ్‌లో ఉన్నాయి. ఇందులో ఎస్‌పీవో2 సెన్సార్ లేదు. దీని ధర రూ.7,999.
ఇవే కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 2 (రూ.3,999), ఫిట్‌బిట్ చార్జ్ 4 (రూ.13,850), హానర్ వాచ్ ఈఎస్ (రూ.7,999), గార్మిన్ వివో స్మార్ట్ 4 (రూ.4,214), ఫిట్ బిట్ ఇన్‌స్పైర్ హెచ్ఆర్ (రూ.8,499) స్మార్ట్ బ్యాండ్స్ కూడా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పైన తెలిపిన బ్యాండ్స్ లాగే ఉత్తమ ప్రదర్శనను ఇస్తాయి. చక్కని ఫీచర్లను కలిగి ఉన్నాయి. వినియోగదారులు వీటిల్లో ఏ బ్యాండ్ ను అయినా కొనుగోలు చేయవచ్చు.