కొత్త నాణేలు వచ్చేశాయ్.. వీటి స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

-

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త నాణేలకు విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ కలిసి కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు.

ప్రధాని మోడీ-నిర్మలా సీతారామన్

అయితే, ఈ నాణేలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నాణేలను అంధులు సులభంగా గుర్తించేలా రూపొందించారు. రూ.1, 2, 5, 10, 20 మారకపు విలువ కలిగిన కొత్త నాణేలను ముద్రించారు. ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదు.. త్వరలో వాడుకలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 12 పథకాలతో అనుసంధానించిన ‘జన సమ్మర్ద్ పోర్టల్’ను ప్రారంభించారు.

https://twitter.com/ANI/status/1533714678555496448/photo/1

ఈ కొత్త నాణేలు దేశాభివృద్ధికి, ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోడీ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విడుదల చేసిన నాణేలు అమృత్ కాలం నాటి అద్భుత ఘడియలను ప్రజలకు గుర్తు చేస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version