విషమంగానే బాలు ఆరోగ్యం, అంతర్జాతీయ నిపుణుల కోసం వెయిటింగ్…!

-

ఆగస్ట్ 5 న కరోనా వైరస్ తో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ వెటరన్ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగానే ఉంది అని ఎమ్జీఎం ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. బాలు అవయవాల పని తీరుని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్సకు స్పందిస్తున్నారని అన్నారు.

ఆయన కోలుకుని బయటపడతారు అని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక ఆయన కోలుకోవాలి అని ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమలు ప్రార్ధనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ వైద్య నిపుణులతో చర్చిస్తామని, వారి నుంచి సలహాలు తీసుకుని ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుకి వెంటిలేటర్ పైనే చికిత్స న్దిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version