రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. మోడీ పుట్టుకతో బీసీ కాదు. లీగల్లి కన్వర్టెడ్ బీసీ అనేది నిజం కదా అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. మోడీ obc ముసుగు వేసుకుని ఉన్నాడు తప్పితే బీసీ లకు చేసింది లేదు. బీసీ కుల గణన మేము చేశాం.. దేశం లో ఎవరు చేయలేదు. బండి సంజయ్ పుట్టుకతో బీసీ. కేంద్రం obc కోసం ఏం చేసిందో చెప్పాలి.
విద్యా, ఉద్యోగం లో ఏం అవకాశాలు ఇచ్చారు. మీరు చేయరు.. చేసేవాళ్ళను చేయనివ్వరూ. బండి సంజయ్.. నువ్వు bc అధ్యక్షుడిగా కష్టపడుతుంటే తీసి పక్కన పడేసింది. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. జన గణనలో బీసీ కుల గణన చేయండి. రేవంత్ రెడ్డి.. రెడ్డి కులం అయినా.. బీసీ లకు 42 శాతం ఇస్తాం అన్నారు. రాహుల్ గాంధీది దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ నేతల త్యాగం ఏముంది. రాహుల్ గాంధీ ఏ కులమో దేశం అంతా తెలుసు. రాహుల్ గాంధీ కులం అడగడం ఎందుకు.. బీజేపీ ప్రభుత్వం కుల గణన చేయిస్తే.. రాహుల్ గాంధీ నే కులం ఏదో చెప్తారు అని బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.