ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాం హౌస్ లో కేసీఆర్ సేద తీరుతున్నారు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బిఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. తెలంగాణలో 8 మంది బిజెపి ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీ. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. బిఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది. బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్ , ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.