TSPSC పేపర్ లీక్ పై రేవంత్ రెడ్డి కమిటీ…

-

తెలంగాణ రాష్ట్రంలో యదావిధిగా జరగాల్సిన TSPSC గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని పేపర్ లు లీక్ అవడం వలన ఈ నిర్ణయాన్ని TSPSC తీసుకుంది. కాగా ఈ ఘటనకు కారణం అయినా వాటిని SIT విచారిస్తూ మరిన్ని కీలక విషయాలను సేకరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కమిటీ పని చేయనుంది.

ఈ కమిటీకి మల్లు రవి చైర్మన్ గా ఉందనుండగా, విద్యార్థి ఉద్యమాల కమిటీ ఏర్పాటైంది. కాగా బల్మురి వెంకట్, శివసేన రెడ్డి, మానవతా రాయ్, బాలలక్ష్మి మరియు మల్లాది పవన్ కు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ యొక్క ముఖ్య లక్ష్యం ఇలాంటి సమస్యలు ఏర్పడితే న్యాయం జరిగే వరకు నిరసనలు చేయడమే. మరి ఈ TSPSC పేపర్ లీక్ ఘటనలో ఈ విధంగా వీరి నిరసన ఉండనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version