ఏప్రిల్ 6వ తేదీన ఓయూలో “బలగం” సినిమా ప్రదర్శన

-

తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవ న స్థితిగ తులను చూపిస్తూ మూవీలు ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడూ వస్తున్నాయి.

అలాంటి చిత్రమే ‘బలగం’. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని టాలీవుడ్‌లో కమెడియన్‌గా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వేణు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

మానవ సంబంధాలపై తెరకెక్కిన ‘బలగం’ మూవీని ఏప్రిల్ 6న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శించనున్నట్లు ఓయూ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ఠాగూర్ ఆడిటోరియంలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. క్యాంపస్ పరిధిలోని కాలేజీల విద్యార్థులు మూవీని వీక్షించడానికి తమ పేర్లను నమోదు చేయించుకుని, ఐడి కార్డులతో రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version