కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేదావులతో జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇంటిలో ఉద్యోగం వస్తుందన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుంది.. తప్ప రాష్ట్రం బాగుపడలేదు. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శాఖల వారీగా ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను నింపే నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి. లోపాయకారి ఒప్పందంతో BRS, బీజెపీ పార్టీకి సహకారం చేస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కడుతుంది. బీజెపి పార్టీ నుండి గెలిసిన 8 మంది ఎంపీలు, ఇద్దరు మంత్రులు ఉండి రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుంది. భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో మేటి రాష్ట్రంగా నిలపడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.