హకీంపేటలో ట్రాక్టర్ బోల్తా.. పది మందికి తీవ్రగాయాలు

-

మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.నేటి ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ విషాద ఘటనలో పది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికుల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

జిల్లాలోని మాసాయిపేట్ మండలం హకీంపేట్‌లో ఈ ఘోర ప్రమాదం శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news