కామారెడ్డి – కరీంనగర్ మధ్య రాకపోకలు బంద్

-

కామారెడ్డి – కరీంనగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పాల్వంచ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి – కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. లక్ష్మీ రావులపల్లి, మంతెన దేవులపల్లి ఊర్ల మధ్య పూర్తిగా స్తంభించిపోయాయి రాకపోకలు.

Traffic between Kamareddy and Karimnagar has been suspended
Traffic between Kamareddy and Karimnagar has been suspended

అటు కామారెడ్డి జిల్లా మొత్తం జలమయం అయింది. బీబీపేట – కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దింతో బీబీపేట – కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు ఉంది. ఇక అటు కామారెడ్డి లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా .. 20 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డి జిల్లాలో NH44 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారిపై వరద నీరు నిల్వలేనప్పటికీ, ట్రాఫిక్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 20 కి.మీ మేర నిలిచిపోయాయి వాహనాలు.

Read more RELATED
Recommended to you

Latest news