BREAKING : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఈనెల 9 నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

హైదరాబాద్ లో ఇటీవల ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు జరిగాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేసు హైదరాబాద్ లో
జరుగింది. అయితే.. రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దారు. అయితే వివిధ కారణాల వల్ల గత నెల 19,20 తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దుచేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి లీగ్ రౌండ్ లో భాగంగా ప్రాక్టీస్ చేస్తుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. ఈ షోకి టికెట్లు కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది ఇండియన్ రేస్ లీగ్. ఒకరోజు రెగ్యులర్ టికెట్ ధర రూ.749 నుంచి ప్రారంభం అయింది. వారాంతపు పాస్ రూ.1249గా వుంది.

ఈసారి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. కార్‌‌ రేసింగ్‌ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్
ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు ఎన్టీఆర్‌‌ మార్గ్, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులులో వుంటాయని పోలీసులు తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకూ కార్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తారు.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్,నెక్లెస్ రోడ్,ఐమాక్స్ రోటరీ వైపు రోడ్‌ క్లోజ్‌ చేస్తారు.  బుద్దభవన్,నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ.  రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్,ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలకు నో ఎంట్రీ.  ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే రోడ్స్ క్లోజ్.  బీఆర్‌‌కెఆర్‌‌ భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు.  ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్‌.  ఎన్టీఆర్ గార్డెన్, ఎన్‌టీఆర్‌‌ఘాట్,నెక్లెస్ రోడ్,లుంబినీ పార్క్ రోడ్లు మూసివేత

 

Read more RELATED
Recommended to you

Exit mobile version