Breaking : భాగ్యనగర వాసులకు అలర్ట్‌.. రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత్‌ జోడో యాత్రలో పాల్గొననున్నారు. అంతేకాకుండా.. చార్మినార్‌, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్‌ మీటింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో.. భాగ్యనగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర రేపు హైదరాబాద్ లో జరుగనుంది. 8 కిలోమీటర్లు పొడవునా రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతుంది. దీంతో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి గమనించగలరని మనవి. మధ్యాహ్నం 3 గంటలు నుండి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పురణాపుల్ , ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా పాద యాత్ర కొనసాగునుంది. చార్మినార్ వద్ద పథకాన్ని ఎగరవేస్తారు.

సౌత్ జోన్ లో 3 గంటలు నుండి ఆరు వరకు ట్రాఫిక్ ఉంటుంది. అఫ్జల్ గంజ్, మొహంజాయి మార్కెట్ , గాంధీ భవన్, పోలీస్ కంట్రోల్ రూమ్. రవీంద్ర భారతీ, RBI, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, NTR మార్గ్ , ఐమాక్స్ మీదుగా పాదయాత్ర ఉంటుంది. ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పాదయాత్ర జరిగే మూడు కిలో మీటర్ల రేడియస్ లో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి. ఆర్టీసీ బస్సులను సైతం డైవర్ట్ చేస్తున్నాం, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు పలు నియోజకవర్గ లనుండి చాలా మంది కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులకు పార్కింగ్ లు కేటాయించాము.

రెండు సెంటర్లు చార్మినార్, అలాగే ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. చార్మినార్ వద్ద మూడు గంటలు నుండి ప్రోగ్రాం మొదలవుతుంది, ఐమాక్స్ వద్ద 8.30 గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్, వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశాము. రేపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version