‘వీర సింహారెడ్డి‌’ ప్రీ రిలీజ్‌ ఎఫెక్ట్.. ఒంగోలులో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

నందమూరి బాలకృష్ణ-శ్రుతి హాసన్ జంటగా నటించిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ఒంగోలులోని బీఎంఆర్‌ వెంచర్స్‌ సిద్ధమవుతోంది. చిత్ర నటీనటులతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం మంగమ్మ కాలేజీ, మార్కెట్ యార్డ్‌ల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.

మాస్‌ యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా ట్రైలర్‌ విడుదల జరగనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. నందమూరి అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈసినిమా కోసం బాలకృష్ణ, శ్రుతిహాసన్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version