ఢిల్లీలో కొత్తగా ప్రవేశపెట్టిన సరి-బేసి సంఖ్యల అమల్లో ఉన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఐటీవో సమీపంలో తాపీగా రోడ్డు మీదికి వచ్చిన ఓ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు. సరిసంఖ్య అమల్లో ఉన్నరోజు బేసి సంఖ్య ఉన్న నంబర్ నంబర్‌తో బయటికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించడంతో డ్రైవర్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు పలకరించడంతో సదరు డ్రైవర్ మాట్లాడుతూ.. `నేను నోయిడాలో ఉంటాను.
ఓ పని నిమిత్తం గత రాత్రి ఇక్కడికి వచ్చాను. వాస్తవానికి ఇవాళ ఇక్కడ సరి-భేసి విధానం అమల్లోకి వచ్చిందని నాకు తెలియదు` అని వాపోయాడు. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగడంతో.. కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కాలుష్యం పెరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామనీ… దీనికి ప్రజలు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. రిజిస్ట్రేషన్ నెంబరు చివరిలో సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు… బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్డు మీదకు రావాలని ఆయన పేర్కొన్నారు.