శివరాత్రి పర్వదినాన విషాదం.. పుణ్యస్నానానికి నదిలోకి దిగి ముగ్గురు గల్లంతు

-

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. సమయం పెరుగుతున్న కొద్దీ ఆలయాల్లో భక్తుల సంఖ్య పెరుగుతోంది. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు.

మరోవైపు పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నదిలో దిగి గల్లంతయ్యారు. పండుగ పూట పుణ్యస్నానాలు చేయడానికి నదిలో దిగిన ముగ్గురు గల్లంతైన ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగారు.  కొద్ది క్షణాల్లో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news