సౌతాఫ్రికాలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కడి బంగారు గనిలో గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు స్మగ్లర్లు బంగారం తవ్వకానికి కొందరు కార్మికులను గనిలోకి పంపించారు. నెలల తరబడి అక్రమంగా మైనింగ్ చేయడంతో ఆకలి, డీ హైడ్రేషన్ కారణంగా 100 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
విషయం తెలియడంతో అధికారులు అక్కడకు చేరుకుని అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. బంగారు గనిలో చిక్కుకుని మరణించిన వారి మృతదేహాలను బయటకు వెలికితీశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పలువురు కార్మికులను రక్షించిన పోలీసులు, రెస్క్యూ టీమ్స్.. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులను భయపెట్టి అక్రమంగా మైనింగ్ చేయిస్తున్న వారి కోసం అధికారులు గాలిస్తున్నారు.