ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

-

చాలా మంది రైలు టికెట్లను బుక్ చేసుకునే క్రమంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు మీరు కూడా ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా…? ఈజీగా వేగంగా బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వడం మంచిది. IRCTC ద్వారా రైల్వే టికెట్ లని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు మొదట IRCTC వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.

లేదంటే యాప్ లోకి అయినా మీరు వెళ్లొచ్చు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో రైలు టికెట్లు ని మనం క్యూలలో నిలబడకుండా ఈజీగా ఇంట్లో ఉండే బుక్ చేసుకోవడానికి అవుతుంది అత్యాధునిక టెక్నాలజీ తో ఇంట్లో కూర్చుని ఫోన్ ద్వారా మనం రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇక మనం టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి..? IRCTC అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం.

మొదట మీరు ఐఆర్‪సీటీసీ వెబ్‌సైట్ లోకి వెళ్ళండి.
ఆ తరవాత పేజీ కుడి వైపు ‘Register’ బటన్‌ ఉంటుంది. క్లిక్ చేయాలి.
ఇప్పుడు ‘Individual’ మీద నొక్కండి. పేరు, పుట్టిన తేదీ, జండర్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రస్ వంటి వివరాలు ఇవ్వండి.
యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి. ఆ తరవాత యూజర్ నేమ్ ప్రత్యేకంగా 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండేలా చూడండి. క్యాప్చా కోడ్‌ ని ఎంటర్ చేసేసి ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేసి మళ్లీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి చాలు.

ఇలా టికెట్ ని బుక్ చెయ్యండి:

ఐఆర్‪సీటీసీ అకౌంట్ లోకి లాగిన్ చేసేసి.. ప్రయాణ తేదీలని ఎంటర్ చెయ్యండి. ట్రావెల్ క్లాస్ ని ఎంచుకోండి.
రైళ్లు, సమయాలను చెక్ చేయడానికి ‘Find Trains’పై మీద నొక్కండి.
ట్రైన్ ని ఎంచుకుని, ‘Check Availability & Fare’పై క్లిక్ చేయాలి. కోటాను ఇప్పుడు ఎంచుకోండి
ఆ తరవాత ‘Book Now’పై క్లిక్ చేయాలి.
వివరాలని ఇచ్చేసి ‘Continue Booking’పై క్లిక్ చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత మీ టిక్కెట్ వివరాలతో confirmation మెసేజ్, ఇమెయిల్‌ మీకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version