బిగ్ బాస్ రేవంత్ లైఫ్ లో విషాద కోణం..!!

-

21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ప్రస్తుతం 5గురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. ఈ వారం మధ్యలో  శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక ఉన్న వారిలో ఎప్పటిలాగే సింగర్ రేవంత్ బిగ్ బాస్ షో టైటిల్ రేసులో ముందు ఉన్నాడు.

తన మనస్తత్వం చూస్తే . ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అందరితో గొడవలు పడతాడు, మళ్లీ కాసేపటికే సారీ చెప్పి కలిసిపోతాడు. అలా రేవంత్‌లో ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉన్నాయి.  తాజాగా రేవంత్   తల్లి సీతా సుబ్బలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో రేవంత్ జీవితంలొ ఉన్న విషాద కోణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

ఆమె చెబుతూ రేవంత్‌ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు.భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచాను  మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు.. నన్ను, నా పిల్లలకు అండగా నిలిచారు . వాళ్లు అండగా లేకపోతే మా బతుకుల దారుణంగా ఉండేవి.రేవంత్‌ పుట్టాక నీకు నాన్న చనిపోయాడని అంటే బాధపడతాడు అని మీ నాన్న దుబాయ్‌లో ఉంటారు..  వస్తారులే అని చెప్పేదాన్ని. వాడు అందరిలా తండ్రి ప్రేమ నోచుకోలేదు అదే నన్ను ఎప్పుడూ భాద పెడుతూ ఉంటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version